VJY 27, Sep 27: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జెల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇక బెయిల్ రాకపోవడం చంద్రబాబుకు నిరాశను కలిగిస్తే... సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా వాయిదా వేయడం ఆయనకు కొంత ఉపశమనాన్ని కలిగించే అంశమే. అక్టోబర్ 5వ తేదీ వరకు సీఐడీ అధికారుల విచారణను ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురయింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదాపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. మెన్షన్ చేసే సందర్భంలో స్వల్ప వాదనలు జరిగాయి. న్యాయవాది లూథ్రా వాదనలను ప్రభుత్వ లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా తగిన బెంచ్ ఎదుట కేసును బదిలీ చేసి అక్టోబర్ 3న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా పడింది. ఈ కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేస్లన్నట్లు హైకోర్టు పేర్కొంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా. ఇవాళ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు.