 
                                                                 Vjy, Nov 13: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ రాజు ఎంపిక లాంఛనప్రాయంగానే జరగనుంది.
ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యే ఉండటం.. పైగా వారు శాసన సభకు దూరంగా ఉండటంతో ఏకగ్రీవంగానే రఘురామ ఎన్నిక కానున్నారు. బీజేపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రఘురామ కృష్ణరాజు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ కొంతకాలానికే జగన్‌పై ఆయన విమర్శలు చేస్తూ రెబల్‌గా మారారు.
2024 ఎన్నికలకు ముందు వైసీపీకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయన.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
