Credits: X

Vijayawada, Sep 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) గందరగోళంగా మారాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు (Arrest) అక్రమమంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు. సభలో నినాదాలు చేస్తూ ఆందోళన తెలుపుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో విజిల్ వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ గందరగోళంగా మారింది. ఓవైపు అధికార పక్షం ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు.

Uttar Pradesh Viral: టీ తాగటానికి పోలీసులు వ్యాన్ ఆపడంతో నిందితుల పరార్.. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

సెషన్ మొత్తానికీ సస్పెండ్

స్పీకర్ పలుమార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. చంద్రబాబు అరెస్టుపై సభలో చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. ఈ ఆందోళనను సెల్ ఫోన్ లో వీడియో తీయడంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినిపించుకోక పోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ మొత్తానికీ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన.. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసన.. 15 నిమిషాల్లోనే సభ వాయిదా