Amaravati, Nov 23: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Winter Session 2021) ప్రారంభమయ్యాయి. నేటి నాలుగవ రోజు సమావేశాల్లో (AP Assembly Winter Session 2021 Fourth Day) కులాలవారీగా బీసీ జనగణన తీర్మానం చేయాలని తీర్మానించారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని వేణుగోపాల కృష్ణ అన్నారు.
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. కుల గణన కచ్చితంగా జరగాలి. ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వరంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అనేక మేళ్లు. బీసీలను చైతన్యం దిశగా సీఎం జగన్ నడిస్తున్నారు. ఇది బీసీల ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్ చేయూత గొప్ప పథకం. బీసీల కోసం వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే.. వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2446 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. గతంలో కేవలం 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగేంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 1387 వ్యాధులను అదనంగా చేర్చడం జరిగిందని మంత్రి తెలిపారు.దేశంలోనే ఆదర్శమైన పథకం ఆరోగ్యశ్రీ అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
ఇక ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. ఒక ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రత్యేకవాదం వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయి.
చంద్రబాబు ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించింది. ఎక్కడా లేనట్లు 7500 చ.కి.మీటర్లలో రాజధానిని కడతామన్నారు. 50వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.
ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన అన్నారు.