Amaravati, Mar 20: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు. స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది.
రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్‌డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్‌లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది.
విదేశాల నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి సొమ్ము రాష్ట్రానికి వచ్చింది. వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371కోట్లు కొట్టేశారు. చంద్రబాబు ముఠా విజన్ ప్రకారం స్కామ్ చేశారు. దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో బాబుకు బాగా తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్ చేశారు. ఇవన్నీ ఒక క్రిమినల్ మాత్రమే చేయగలడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కాం ఊపిరిపోసుకుందన్నారు. ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే పూర్తి చర్చ జరగాలి. చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారు’ అని అన్నారు.
ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ అన్నారు.201-19 మధ్య చంద్రబాబు కొన్ని సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి, ఫైబర్ నెట్ వంటి సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రూ. 3,356 కోట్ల ప్రాజెక్ట్ అని మోసం చేశారు. సీమెన్స్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు రిలీజ్ చేశారు.
ప్రాజెక్ట్ డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ఆమోదం తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా నిధులు మళ్లించారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి కాకుండా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలించారు. తప్పు జరినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు. స్కామ్‌తో మాకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే వాళ్ల మనుషులని అర్థం. చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన ఒప్పందం ఇదే. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగింది.
చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదు. మేం అధికారంలోకి వచ్చాకే స్కామ్ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు. తన బాబు తన స్కిల్ చూపించి రూ.371 కోట్లు కొట్టేశారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు.. లూటీ చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే స్కిల్ చంద్రబాబుకు ఉంది. ఈ స్కామ్‌పై పూర్తి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.