Amaravati, July 15: ఏపీ మంత్రి మండలి సమావేశం (Andhra Pradesh cabinet Meeting) ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ఏర్పాటుపై (New Districts Formation Committee) మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు (new districts) అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థిక సాయం, ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది.
కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలిపారు.