Amaravati, July 14: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ ఏపీలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కరోనావైరస్ (Coronavirus) సోకిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త, రీఫండ్ చేసుకునేందుకు మరోమారు అవకాశం, ఈనెల 29 వరకు గడువు
కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కోవిడ్-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీలో తాజాగా 1,916 కరోనా కేసులు, నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్, విశాఖలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా
కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సమీక్షా సమావేశం (AP CM YS Jagan Review) నిర్వహించారు. పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని, వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం వైస్ జగన్ ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రులు,క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం వైఎస్ జగన్‌ఆదేశించారు. మనం దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉంది. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని సీఎం స్పష్టం చేశారు.
కాగా కరోనా పరీక్షల కోసం నమూనాల సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ ల్యాబ్‌ల్లో నమూనా సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నమూనా సేకరణ కౌంటర్లు మూడు షిఫ్ట్‌లు పని చేసేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ల్యాబ్‌ల్లో సేకరించిన నమూనా ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్ అనుసరించి నమూనాలను జాగత్ర చేయాలని సూచించింది. ఐడీ నంబరు, సరైన మూత లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది