AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం, 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం
CM-YS-jagan-Review-Meeting

Amaravati, June 24: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ (AP Cabinet Meeting) భేటీ ముగిసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్‌ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జిల్లా పేరు మార్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమలాపురం(Amalapuram)లో భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

అమ్మఒడి కోతలపై నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్సా సత్యనారాయణ, అటెండెన్స్‌ ఆధారంగానే అమ్మఒడి ఉంటుందని తెలిపిన మంత్రి, ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం

కేబినెట్‌ ఆమోదించిన అంశాలివే..

►ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం

►మరో 4 సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం

►రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం

►జులైలో అమలు చేసే జగనన్న విద్య కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోదం

►వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

►3,530 ఉద్యోగాలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల లో భర్తీ కి ఆమోదం

►15 వేల కోట్ల పెట్టుబడి పెట్టె ఆదాని గ్రీన్ ఎనర్జి ప్రాజెక్ట్ కు ఆమోదం

►దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం