Amaravati,June 4: కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ (Lockdown)విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రెండో సారి రూ. 10 వేలు అందించనున్నారు. బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ మాట ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) కింద వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. గతేడాది అనుకున్న ప్రకారం అందించారు. ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు
ఈ ఏడాది కూడా నాలుగు నెలల ముందుగానే డబ్బులు అందివ్వనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్‌లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. గురువారం సాయంత్రానికి దాదాపు అందరి ఖాతాల్లో నగదు జమ కానుంది.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.