మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 23వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం అందింది. ఇటీవలే ఆచార్య ట్రైలర్ విడుదల కాగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించగా.. సినిమా కథ ఆ పాత్ర ద్వారానే అల్లుకున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. ఏప్రిల్ 29న ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా.. విలన్ పాత్రను సోనూసూద్ పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య సినిమా నిర్మించగా.. దేవిశ్రీ సంగీత బాణీలు సమకూర్చారు.