Cyclone Gulab: ఏపీ వైపు దూసుకొస్తున్న గులాబ్ తుఫాను, సీఎం జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి
ఏపీ, ఒడిషాలకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Amaravati, Sep 26: ఏపీ, ఒడిషాలకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
తుపాను నేపథ్యంలో (Cyclone Gulab) అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని (AP CM YS Jagan asks officials to make AP cyclone-ready) సూచించారు. కాగా, ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలను గులాబ్ తుపాను తాకనుంది. ఈరోజు అర్థరాత్రి గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Here's PM Tweet
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh CM Jagan Mohan Reddy) ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.
గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి @ysjagan గారితో మాట్లాడాను .కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) September 26, 2021
Spoke to Andhra Pradesh CM Shri @ysjagan and took stock of the situation arising in the wake of Cyclone Gulab. Assured all possible support from the Centre. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) September 26, 2021
కాగా, ఆదివారం అర్థరాత్రి గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 26, 2021 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

