CM YS Jagan Review: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలు, త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 29: ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై (bandwidth internet to village Digital libraries) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం (Cm YS Jagan Review) చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలని తెలిపారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని సీఎం జగన్‌ (YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం చేపడుతున్నామని, మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎంకు వివరించారు.

రేపే తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇవి ఉపయోగపడాలని, విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను (village Digital libraries) సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వాహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలియజేయగా.. అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మేగజైన్‌ల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీరెడ్డి, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఫతావుల్లా, పలువురు నేతలను కీలక పదవుల్లో నియమించిన అచ్చెన్నాయుడు

ఉగాది నాటికి ఫేజ్‌1లో కంప్యూటర్‌ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌2 పూర్తి చేసేలా కార్యాచరణ చేయాలన్నారు. జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అన్‌ఇంటరెప్టడ్‌ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.