CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Feb 8: ఏపీ రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ (YSR Jagananna Chedodu) నగదు విడుదల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan ) మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు (YSR Jagananna Chedodu Scheme 2021) కింద 2.85 లక్షల మందికి సాయం చేస్తున్నామని తెలిపారు. 2,85,350 మంది బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 285.35 కోట్లను జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

షాపులున్న 1,46,103 మంది టైలర్లుకు రూ. 146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే.

గల్లా జయదేవ్ కు కరోనా, తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్

మంగళవారం విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లు. లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితానుంచి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారులను ఎంపికచేశారు. పాత అప్పులకు జమచేసుకోలేని విధంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.