PM Narendra Modi Phone Call to Ap CM YS Jagan (Photo-PTI)

Amaravati, Oct 4: ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ (AP CM meeting with PM Modi) ఖరారయ్యింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy) ఈ నెల 6వ తేదీ ఉదయం.. ప్రధాని మోదీతో ( PM Narendra Modi) సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో (Amit Shah) సమావేశమై రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రధాని దృష్టికి కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను తీసుకెళ్లి త్వరగా పరిష్కరింపచేయాలని కోరడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం. సీఎం జగన్‌ ఐదో తేదీ ఉదయం పులివెందుల వెళతారు. అక్కడ తన మామగారైన ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడినుంచి బయల్దేరి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు.

మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు, రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు ఈనెల 16న శంకుస్థాపనలు, దుర్గ ప్లై ఓవర్ కూడా అదే రోజు ప్రారంభం

అక్టోబర్ 6వ తేదీ ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై అపెక్స్‌ కమిటీ భేటీ ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ పాల్గొంటారు. అదే రోజున ప్రధానితో జగన్‌ సమావేశమవుతారు. పోలవరానికి నిధులతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది.