CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 11: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో (CM YS Jagan Review) స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై సీఎం ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని చెప్పిన అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.

టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్న అధికారులు వివరించారు. ​ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి...ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని తెలిపిన అధికారుల సీఎంకు తెలిపారు. ​​​​ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, ఎండిఎం అండ్‌ శానిటేషన్‌ డైరెక్టర్‌ బి ఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

​​​​​​​

రివ్యూ హైలెట్స్ పాయింట్స్

​​​​​​​►పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశం

​​​​​​​►ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం

​​​​​​​►విద్యాకానుకను అమలు చేస్తున్నాం

​​​​​​​►వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దాం:

​​​​​​​►అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలి:

​​​​​​​►అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టాం:

​​​​​​​►కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంది:

​​​​​​​►రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడింది:

​​​​​​​►అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితులు వచ్చాయి:

​​​​​​​►అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాం, మార్చి చివరి వారంలో కోవిడ్‌ ప్రారంభం అయ్యింది :

​​​​​​​►అమ్మ ఒడి అమల్లోకి వచ్చిన 2–3 నెలలు తిరగకముందే కోవిడ్‌ ప్రారంభం అయ్యింది, స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది:

​​​​​​​►తిరిగి 2020, నవంబరు, డిసెంబరుల్లో పాఠశాలలు తెరిచాం:

​​​​​​​►జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చాం, మళ్లీ రెండో వేవ్‌ కోవిడ్‌ వచ్చింది:

​​​​​​​►పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయి:

​​​​​​​►ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించాం:

​​​​​​​►2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలి:

​​​​​​​​​​​​​► 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నాం:

​​​​​​​►ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలి:

​​​​​​​► సాధారణంగా జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయితే ఏప్రిల్‌వరకూ కొనసాగుతాయి:

​​​​​​​►కాబట్టి ... ఆ విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలి:

​​​​​​​►హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలి:

​​​​​​​►అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలి:

​​​​​​​►అకడమిక్‌ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాలి: సీఎం

అన్ని స్కూళ్లకూ- సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌

​​​​​​​►అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలి: సీఎం

​​​​​​​►2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలి: సీఎం

​​​​​​​►ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ఉండాలి:

​​​​​​​►దీనిమీద మ్యాపింగ్‌చేసి.. ప్లే గ్రౌండ్‌లేని చోట భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలి:

​​​​​​​►ఈమేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశం

​​​​​​​►కాలక్రమేణా ప్రి హైస్కూల్‌ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్‌ఉండేలా చర్యలు తీసుకోవాలి:

విద్యాకానుకపైనా సీఎం సమీక్ష

​​​​​​​►డిసెంబర్‌ నాటికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

​​​​​​​► పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలన్న సీఎం

​​​​​​​►విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌కి ఉపయోగపడేలా ఉండే షూ

​​​​​​​►స్పోర్ట్స్‌ డ్రస్, షూలను పరిశీలించిన సీఎం.. కొన్ని సూచనలు చేశారు.

​​​​​​​►ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలన్న సీఎం

​​​​​​​►మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందన్న సీఎం

​​​​​​​►దీనిపై కార్యాచరణ సిద్ధంచేయండి : అధికారులకు సీఎం ఆదేశం

​​​​​​​►స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారుల ప్రతిపాదన

​​​​​​​►సోషల్‌ ఆడిట్‌ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారుల ప్రతిపాదన

​​​​​​​►ఇలాంటి ఏ మార్పులు తీసుకు వచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశాలు

​​​​​​​►చిరునవ్వుతో వారిని ఆహ్వానించి వారి అభిప్రాయాలూ తీసుకోవాలన్న సీఎం

​​​​​​​►అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా ఉండకూడదన్న సీఎం

​​​​​​​►దీనివల్ల అపోహలు పెరుగుతాయన్న సీఎం

​​​​​​​► ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలనుకున్నా దానివెనుకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలన్న సీఎం

​​​​​​​​​​​​​​►ర్యాంకింగ్‌లు కూడా ఎందుకు ఇస్తున్నామో వారికి స్పష్టంగా చెప్పాలన్న సీఎం

​​​​​​​►ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ విధానం ఉండాలన్న సీఎం

​​​​​​​► టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురిచేయడానికో ఇలాంటి విధానాలు కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులకు సీఎం ఆదేశాలు

​​​​​​​►స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్‌ఆడిటింగ్‌ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం.

​​​​​​​►టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు

​​​​​​​►సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలన్న సీఎం

​​​​​​​► ఈనెలాఖరు నాటికి మ్యాపింగ్‌ పూర్తిచేస్తామన్న అధికారులు

​​​​​​​►పాఠ్యప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలన్న సీఎం

​​​​​​​►దీనిపై తర్వాత సమావేశంలో వివరాలు అందించాలన్న సీఎం

​​​​​​​►ఎయిడెడ్‌ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి: సీఎం

​​​​​​​►ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంది:

​​​​​​​►లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి:

​​​​​​​►ఇందులో ఎలాంటి బలవంతం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి:

​​​​​​​►ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టంచేయాలన్న సీఎం