Amaravathi, November 11: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని ఏపీ సర్కారు జీవో విడుదల చేసిన నేపథ్యంలో దానిపై రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆ పథకం బేష్ అంటుంటే మరికొందరు తెలుగును చంపేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CMYS Jagan) అన్నారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (azad-birth-anniversary-celebrations) వేడుకల కార్యక్రమంలో ఏపీ సీఎం(Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy ) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాలను(opposition parties)ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడకల్లో ఏపీ సీఎం
జాతీయ విద్య, అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని, అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు pic.twitter.com/e0QAF8d7uk
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 11, 2019
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu), ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్ (Janasena chief Pawan Kalyan) వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారు. పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్నా.. చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు?. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు. మరి ఆయన కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు?
పిల్లల్ని మంచి చదవులు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పిల్లలకి ఉన్నత చదవులు అందించాలని అనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణమని అన్నారు.
దీనికి జనసేనాధినేత అభిమానులు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగు మీడియా కావాలని డిమాండ్ చేసిందని.. అధికారంలోకి రావడంతోనే మాట మార్చి ఇంగ్లీషు మీడియం అంటోందని విమర్శించారు.
జనసేన అభిమానుల ట్వీట్
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా @PawanKalyan గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్ధ @ysjagan లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం.
మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?
— JanaSena Shatagni (@JSPShatagniTeam) November 11, 2019
మీ నాన్న గారి కాలంలో తమరు దోపిడీల మీద కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన మీద దృష్టి ఉంటే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారు వైఎస్ జగన్.. కానీ ఏం చేస్తాం కనీసం తెలుగు కూడా సరైన బోధన లేని స్థితికి నాయకులందరూ దిగజార్చారు' అని జనసేనాని శతఘ్ని ట్విట్టర్ అకౌంట్ వేదికగా ట్వీట్ చేశారు.
నవంబర్ 14న నాడు-నేడు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నామని, అందుకోసం నవంబరు 14న నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలాం విద్యా పురస్కారాలు ప్రదానం చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. pic.twitter.com/oUfiJmok9o
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 11, 2019
కాగా డిసెంబర్ నెలాఖరులో ఏపీ సర్కారు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని ఏపీ సీఎం తెలిపారు. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మార్పు కోసం శ్రీకారం చుడుతున్నాం. నేడు స్కూళ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం. ప్రతి స్కూల్‌లోనూ బాత్‌రూం, నీళ్లు, బ్లాక్‌బోర్డు, పర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండాలి. ప్రతి స్కూల్‌కు పెయింటింగ్ ఉండాలి.
రేపు సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం చేస్తూ, తెలుగు, ఉర్దూ బాషను తప్పని సరి చేస్తాం. మీడియం మాత్రం ఇంగ్లీష్ చేస్తాం. 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తాం. తరువాత సంవత్సరం 7, ఆ తరువాత 8, 9, 10 ఇలా ఏటేటా ఇంగ్లీష్ మీడియం చేస్తామని అన్నారు.
మదర్సా బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఇక్కడికి వచ్చే ముందు.. మదర్సాల గురించి ఆలోచించాలని కోరారు. ఇందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అక్కడి పిల్లలకు కూడా మోడ్రన్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి. ఉర్దూ, ఖురాన్‌లో రాణిస్తునే మరో వైపు ఇంగ్లీష్ చదువులు చదివేలా రెండు బ్యాలెన్స్ చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని వాళ్ల వద్దకు కూడా తీసుకువెళ్తాం.
మార్చి నుంచి వైయస్‌ఆర్ పెళ్లి కానుక
గతంలో పెళ్లి కానుక చంద్రబాబు పెట్టారు. ఈ పథకం ఆగిపోయింది. నవంబర్ 2018 నుంచి ఈ పథకం తెరమరుగు అయ్యింది. చంద్రబాబు పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైయస్‌ఆర్ పెళ్లి కానుక తీసుకువస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికంటే వైయస్‌ఆర్ పెళ్లి కానుక రెట్టింపు చేస్తూ రూ.1 లక్ష ఇస్తాం. మౌజమ్, మౌలానాలకు గౌరవవేతనాలు పెంచి ఇస్తాం. దీనికి కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. మసీదుల సంఖ్య పెంచుతాం. ఇస్తామన్న రూ.15 వేలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా’ అని అన్నారు.