CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Sep 29: స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్‌ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ (CM YS Jagan VC with Collectors) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌లు, జేసీలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ సచివాలయాల్లో అమలు జరిగినప్పుడే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతాయని తెలిపారు. పక్కాగా తనిఖీలు చేసి రిపేర్‌ చేసినప్పుడే వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందన్నారు. విలేజ్, వార్డ్‌ సెక్రటేరియట్‌లకు సంబంధించి అందరు కలెక్టర్‌లు, జేసీలు, డిపార్ట్‌మెంట్స్‌ హెడ్స్‌ విధిగా తనిఖీలు చేయాలి.

ఇప్పటికే గైడ్‌లైన్స్‌ ఇచ్చాం, కలెక్టర్లు తనిఖీలు చేశారు కానీ జేసీలు మరింత ధ్యాస పెట్టలి. అక్కడి సమస్యలు పరిష్కరించగలిగితే అట్టడుగు స్ధాయి ప్రజలకు మేలు జరుగుతుంది. కొన్ని జిల్లాల జేసీలు సరిగా తనిఖీలు చేయలేదు, వెంటనే ఫోకస్‌ పెట్టండి. డెలివరీ మెకానిజంపై ధ్యాసపెట్టాలి.ప్రతీ జేసీ, కలెక్టర్‌ ప్రతీ వారం ఖచ్చితంగా తనిఖీ చేయాలి, రిపోర్ట్‌ ఇక్కడికి పంపాలి, మేం మీ పనితీరును మానిటర్‌ చేస్తాం, దీనిపై యాప్‌ కూడా సిద్దంగా ఉంది, ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌ చేయాలి అని తెలిపారు.

అయిదు లక్షల ఎకరాలకు ఉచిత బోర్లు, రూ.2,340 కోట్లు ఖర్చు పెట్టనున్న ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలకు సంబంధించి అందరూ కూడా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. అక్టోబర్‌ 2 న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరగనుందని తెలిపారు. అక్టోబర్‌ 5న విద్యాకానుక స్కూల్‌కిట్స్‌ కార్యక్రమం. అక్టోబర్‌ నెలాఖరున తోపుడు బండ్లతో రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి వడ్డీ లేకుండా రుణాలు.. జగనన్న తోడు పేరుతో కార్యక్రమం ప్రారంభం కానున్నాయి అని సీఎం జగన్‌ తెలిపారు.

నవశకం కింద లబ్దిదారులను వెరిఫికేషన్‌లో అనర్హులు అంటున్నాం. కానీ ఎవరైనా లబ్ధిదారుడు నేను అర్హుడిని అని మళ్ళీ దరఖాస్తు చేస్తే దానికి సంబంధించి వెంటనే దానిపై డిజిటల్‌ అసిస్టెంట్‌ ఒక్క రోజులో వెరిఫై చేసి వెల్ఫేర్‌ సెక్రటరీకి పంపాలి. అక్కడి నుంచి 3 రోజుల్లో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయాలి. ఆ తర్వాత సెకండరీ ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ 3 రోజుల్లో పూర్తిచేసి రిపోర్ట్‌ ఎంపీడీవో లేదా మునిసిపల్‌ కమీషనర్‌కు పంపాలి. అక్కడి నుంచి జేసీకి పంపాలి.

నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయండి, చంద్రబాబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, చిత్తూరు జడ్డి సోదరుడుపై దాడి ఘటనపై బాబు లేఖ

జేసీలు వెంటనే స్పందించి సరిచేయాలి. అవసరాన్ని బట్టి డేటా సరిచేయాలి. ఎవరైనా నేను అర్హుడిని అని దరఖాస్తు చేస్తే వెంటనే స్పందించాలి.17 రోజుల్లో మొత్తం పూర్తిచేసి కార్డు అందించాలి. ఈ విధంగా మార్పు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. అందరూ నిర్ణీత టైంలైన్‌లో సేవలు అందించాలి. ప్రతీ లెవల్‌లోనూ వెరిఫికేషన్‌ తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే తప్పులు జరగవు’ అని ఏపీ సీఎం జగన్‌ తెలిపారు.

రైస్‌ కార్డ్, పెన్షన్‌ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, హౌస్‌సైట్‌ ఈ నాలుగు కూడా టైంలైన్‌ లోపు అందాలి. అర్హులకు కొన్ని జిల్లాల్లో రైస్‌ కార్డులు వెంటనే ఇస్తున్నారని న్యూస్‌లో చూస్తున్నాం.. మంచి పరిణామం. మిగిలిన చోట్ల కూడా ధ్యాస పెట్టండి. రైస్‌ కార్డ్, పెన్షన్‌ కార్డు జారీ విలేజ్, వార్డు సెక్రటేరియట్‌ లెవల్‌లో జరగాలి. కొన్ని జిల్లాలు, శాఖలు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి, వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.