Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, Jan 19: ఏపీలో గడచిన 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ (Covid in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 231 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,86,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,443 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,660కి తగ్గింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,142కి (Covid Deaths) చేరింది.

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నాలుగో రోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాలలో కోవిడ్‌ టీకా వేస్తున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా మూడో రోజు కోవిడ్ టీకా వేసుకున్న వారి సంఖ్య 14,606. మూడు రోజులలో వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి మొత్తం సంఖ్య 46,755. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ముందుస్థానంలో ఉంది. వారంలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు.

వివాహేతర సంబంధమే కొంప ముంచిందా, గుడివాడలో ఎస్ఐ ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ముందుగా కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. టీకాల పంపిణీని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

మూడో రోజు జిల్లాల వారీగా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్యను ఓ సారి చూస్తే..

అనంతపురము 1,276

చిత్తూరు 976

తూర్పుగోదావరి 1,923

గుంటూరు 1,490

కృష్ణా 473

కర్నూలు 860

ప్రకాశం 1,017

నెల్లూరు 1,847

శ్రీకాకుళం 1,193

విశాఖపట్నం 1,474

విజయనగరం 781

పశ్చిమగోదావరి 459

వైఎస్సార్ కడప 837