COVID-19 Outbreak in India | File Photo

Visakhapatnam, July 30: ఏపీలోని విశాఖ సెంట్రల్‌ జైల్లో (Visakhapatnam Central Prison) కరోనా వైరస్‌ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు (Mallela Om Prakash) కూడా పాజిటివ్‌గా తేలింది. జల వివాదం, ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్‌ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి కరోనా టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓం ప్రకాష్ చనిపోయే ముందు కొన్ని రోజులు పెరోల్ వెళ్ళాడు. అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాశ్‌ 2008 నవంబర్‌ 9న పరిటాల రవి హత్య కేసులో (Paritala Ravi Murder Case) నిందితుడిగా ఉన్న మొద్దుశీనును జైల్లోనే డంబెల్‌తో కొట్టి హత్య (Moddu Srinu murder case) చేసి వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు

మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్‌ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓం ప్రకాష్‌తో పరిచయం ఉన్న వారందరితో సహా 282 మంది ఖైదీలపై వారు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ తెలిపారు. జైలులో 400 మంది సిబ్బంది, వారి కుటుంబాలు కూడా పరీక్షలు చేయించుకున్నారు.జూలై 27 వరకు చేసిన పరీక్షల ఫలితాలను జైలు అధికారులు అందుకున్నారు. జైలు ప్రాంగణాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రపరిచామని రాహుల్ తెలిపారు. ఒక్కరోజే 10,093 కరోనా కేసులు, రాష్ట్రంలో 1,20,390కి చేరిన కోవిడ్-19 కేసులు, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

"కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి, ఖైదీలందరికీ వేడి నీటిని అందించడం, విటమిన్ సి మరియు మల్టీ విటమిన్ టాబ్లెట్ల పంపిణీ వంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 50 ఏళ్లు పైబడిన వారు కరోనా బారీ పడ్డారని ఆయన అన్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, రోగనిరోధక శక్తిని పెంచడానికి జైలు అధికారులకు కూడా పోషకమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.