Amaravati, July 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ఈ రోజు 10 వేలకు పైగా కేసులు (AP Coronavirus Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10,093 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఈరోజు 2,784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 55,406 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 18,20,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..
కొత్తగా కరోనాతో 65 మంది మృతిచెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,213గా (Coronavirus Deaths) నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. రూ.59కే కరోనా యాంటీ డ్రగ్ ట్యాబ్లెట్, ఫావిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన హెటిరో
గత 24 గంటల్లో జిల్లాలవారిగా కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో 1,676, అనంతపురం జిల్లాలో 1,371, గుంటూరు జల్లాలో 1,124, కర్నూలు జిల్లాలో 1,091, విశాఖ జిల్లాలో 841, చిత్తూరు జిల్లాలో 819, పశ్చిమగోదావరి జిల్లాలో 779, కడప జిల్లాలో 734, నెల్లూరు జిల్లాలో 608, శ్రీకాకుళం జిల్లాలో 496, కృష్ణా జిల్లాలో 259, ప్రకాశం జిల్లాలో 242, విజయనగరం జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి.