Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, Jan 2: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (Coronavirus in AP) నిర్థారణ అయ్యింది. కోవిడ్‌ వల్ల నిన్న ఒక్క రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,850కు చేరింది. మొత్తం 7111 మంది మృత్యువాత పడ్డారు.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 279 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,72,545 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 3,194 యాక్టివ్‌ కేసులు (new COVID-19 cases) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో1,19,32,603 శాంపిల్స్‌ను పరీక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌’ విజయవంతంగా ముగిసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ (మాక్‌ డ్రిల్‌) నిర్వహించారు. మొత్తం 956 మంది పాల్గొన్నారు. ఈ డ్రై రన్‌ ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరించారు. కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అందించనున్నారు.

కొత్త కరోనావైరస్ టెన్సన్, యుకె నుంచి వచ్చే వారి కోసం కొత్త గైడ్ లెన్స్ విడుదల చేసిన కేంద్రం, కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్‌ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్‌లో భాగంగా డిసెంబర్‌ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఏపీ వ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించారు.