Amaravati, Sep 1: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 59,834 నమూనాలు పరీక్షించగా 10,368 పాజిటివ్ కేసులు (AP Coronavirus Updates) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,139 కు చేరింది. కొత్తగా 84 మంది కరోనా బాధితులు మృతి (Coronavirus Deaths) చెందడంతో ఆ సంఖ్య 4,053కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక గడిచిన 24 గంటల్లో 9,350 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 3,39,876 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 37,82,746 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వచ్చిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తమ ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
రోజుకి 10 వేలు కేసులు నమోదైనా.. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందని వెల్లడించారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.