Andhra Pradesh e-Pass: ఏపీకి వచ్చేవారికి ఇకపై నో కండీషన్స్, ఆటోమేటిక్ ఈ పాస్ సిస్టంను ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు, స్పందనలో నమోదు చేసుకుంటే తక్షణమే ఈ పాస్
Just apply for e-pass and drive into Andhra Pradesh without clearance Police (Photo Credits: IANS)

Amaravati, August 3: దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 (Unlock 3) ప్రారంభమైంది. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు ( AP Border) సడలించారు. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ (Lockdown) కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అలాగే మరికొన్ని నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు. ఏపీసీఆర్‌డీఏ కనుమరుగు, దాని స్థానంలో 11 మందితో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు, కమిషనర్‌గా పి.లక్ష్మీనరసింహం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అన్‌లాక్‌ 3.0 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్‌ పోస్టుల్లో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు. ఇంతకుముందు ఎవరు రాష్ట్రములోకి రావాలన్నా స్పందన పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే, దానిని ఆయా జిల్లాల కలెక్టర్ ఆఫీసుల్లో ఉన్న సిబ్బంది చెక్ చేసి, జెన్యూన్ రీజన్ ఉంటేనే పాస్ జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఏపీకి వచ్చేవారు స్పందన వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకుంటే ఆటోమేటిక్ ఇ- పాస్ లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

స్పందన వెబ్ సైటులో (spandana.ap.gov.in) పేరు నమోదు చేస్తే మొబైల్, ఈమెయిల్ లకు తక్షణం ఇ-పాస్ (Andhra Pradesh e-Pass) జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. చెక్ పోస్టుల వద్ద గుర్తింపు పత్రంతో పాటు, ఇ-పాస్ చూపితే రాష్ట్రంలోకి అనుమతిస్తామని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక అధికారి ఎం.టి.కృష్ణ బాబు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రానికి వచ్చే వారిని, వారి ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు, తదుపరి ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి అంటే రేపటి నుండే ఈ తరహా విధానం అమల్లోకి వచ్చింది

ఈ పాస్ నిబంధనలు

దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా ఈ–పాస్‌ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది.

అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ–పాస్‌తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.

ఈ–పాస్‌ వివరాల్ని చెక్‌ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు.

ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు.

ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నేటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది.

సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఈ–పాస్‌ చూపించకపోతే పోలీసులు వెనక్కు తిప్పి పంపుతారు.

ఈ–పాస్‌ దరఖాస్తు www.spandana.ap. gov.in వెబ్‌సైట్‌లో ఉంటుంది.