Andhra Pradesh amaravati-bandh-farmers-protest-against-3-capitals (Photo-wikimedia commons)

Amaravati, August 3: ఏపీసీఆర్‌డీఏ (APCRDA) స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని (Amaravati Metropolitan Region Development Authority (AMRDA)) ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రూ. 50 లక్షల నష్టపరిహారం, శాశ్వత ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం, క్రేన్‌ ప్రమాదంపై కేసు నమోదు, దర్యాప్తు

ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా (APCRDA commissioner) ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు. ఇందులో మొత్తం 11 మంది ఉండనుండగా.. అందులో ఒకరు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌, మరొకరు సభ్య కన్వీనర్‌, మిగిలిన తొమ్మిది మంది సభ్యులుగా ఉండనున్నారు.

ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా నియమితులయ్యారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏఎంఆర్‌డీఏలో సభ్యులు

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్‌

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ –సభ్య కన్వీనర్‌

గుంటూరు జిల్లా కలెక్టర్‌ –సభ్యుడు

కృష్ణా జిల్లా కలెక్టర్‌ – సభ్యుడు

టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ –సభ్యుడు

రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ –సభ్యుడు

ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ –సభ్యుడు

ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ –సభ్యుడు

రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు

రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు