2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, Dec 7: కరోనావైరస్ నియంత్రణ కోసం ఏపీ సర్కారు తీసుకున్న చర్యలతో కోవిడ్ కేసులు (Covid in AP) భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ ప్రభుత్వం (AP Govt) కరోనా మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న నియంత్రణ చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా గడచిన కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్యలో (New Cases) తగ్గుదల భారీగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా, 316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 87 కేసులు వెలుగు చూడగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కొత్త కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం, ప్రకాశం జిల్లాలో 9 కేసుల చొప్పున గుర్తించారు. అదే సమయంలో 595 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఐదుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,038కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,72,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,59,624 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,626 మందికి చికిత్స జరుగుతోంది.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సినిమా, ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి పునాది రాయి వేస్తానని తెలిపిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి

కరోనా వైరస్‌ ముప్పు ఇంకా సమసిపోలేదని, వైరస్‌ నివారణకు తయారవుతున్న వ్యాక్సిన్లు మాజిక్‌ బుల్లెట్లు కావని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్‌తో మహమ్మారి అంతం దగ్గరపడిందని శుక్రవారం వ్యాఖ్యానించిన సమాఖ్య, అంతమాత్రాన కరోనా పూర్తిగా మాయం అవుతుందని భావించట్లేదని తెలిపింది. వ్యాక్సిన్‌ రాగానే అందరికీ అందుబాటులోకి రాదని, అందువల్ల అప్రమత్తత తప్పదని తెలిపింది.

టీకాలు పనిచేయడం ప్రారంభించి క్రమంగా అందరిలో ఇమ్యూనిటీ పెరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం దాదాపు 51 టీకాలు మనుషులపై ప్రయోగదశలో ఉన్నాయని, వీటిలో 13 అంతిమ దశలో ఉన్నాయని పేర్కొంది. వాక్సిన్‌ పంపిణీ, నిల్వ ప్రయాసతో కూడిన అంశాలని గుర్తు చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు దగ్గరపడుతుండడంతో మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. క్రిస్మస్‌ సమయంలో కేసులు మరోమారు పెరగవచ్చని అంచనా వేస్తోంది.