AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravathi, December 31: ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) (APCETs-2020common entrance test) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Educational minister Adimulapu Suresh) సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను(AP EAMCET-2020) నిర్వహించనున్నారు. ఐసెట్‌ను(AP ICET-2020) ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న(AP EDCET-2020) నిర్వహించనున్నారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

పరీక్షల తేదీ వివరాలు

1. ఏపీ ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 - 24 వరకు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టనుంది.

2. ఏపీఈసెట్ పరీక్షను ఏప్రిల్ 30న జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించనుంది.

3.ఏపీఐసెట్ పరీక్షలను ఏప్రిల్ 27న నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్షను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది.

4.ఏపీపీజీఈసెట్ పరీక్షనున మే 2-4 వరకు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించనుంది.

5.ఏపీలాసెట్/పీజీలాసెట్ పరీక్షలను మే 8న నిర్వహించనున్నారు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించనుంది.

6.ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను మే 9న ఆంధ్రాయూనివర్సిటీ నిర్వహించనుంది.

ఏపీఆర్‌సెట్ పరీక్ష తేదీలను తర్వాత వెల్లడించనున్నారు.