ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) ఘోర పరాజయం చవి చూసింది. పార్టీ 2019లో సాధించిన 151 సీట్లు, 50 శాతం ఓట్లతో అధికారంలోకి రాగా ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. ఎన్‌డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి.175 సీట్లకు గాను టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత అప్‌డేట్ ఇస్తా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడి
అటు లోక్‌సభలోని 25 స్థానాలకు గాను టీడీపీ కూటమి 21 చోట్ల విజయం సాధించింది. ఇందులో టీడీపీ 16 స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ 3 చోట్ల, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక అధికార వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేకపోయింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్ చేశాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 45.06 శాతం ఓట్లు
పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీకి 37.79 శాతం ఓట్లు
ఏపీ అసెంబ్లీ ఓట్ల శాతాలు
టీడీపీ - 45.60 శాతం
వైసీపీ - 39.37 శాతం
బీజేపీ - 2.83 శాతం
కాంగ్రెస్ - 1.72 శాతం
బీఎస్పీ - 0.60 శాతం
సీపీఐ - 0.04 శాతం
సీపీఐ(ఎం) - 0.13 శాతం
సీపీఐ (ఎమ్ఎల్)(ఎల్) - 0.01 శాతం
నోటా - 1.09 శాతం
ఎస్పీ - 0.02 శాతం
ఇతరులు - 8.53 శాతం
ఏపీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం
టీడీపీ - 37.79 శాతం
వైసీపీ - 39.61 శాతం
బీజేపీ - 11.28 శాతం
కాంగ్రెస్ - 2.66 శాతం
బీఎస్పీ - 0.67 శాతం
సీపీఐ - 0.03 శాతం
సీపీఐ ఎమ్ - 0.36 శాతం
సీపీఐ ఎమ్ఎల్ - 0.01 శాతం
నోటా - 1.20 శాతం
ఎస్పీ - 0.02 శాతం
ఇతరులు - 6.33 శాతం
తెలంగాణ పార్లమెంటు ఓటింగ్ శాతం
కాంగ్రెస్ - 40.10 శాతం
బీజేపీ - 35.08 శాతం
ఏఐఎమ్‌ఐఎమ్ - 3.02 శాతం
బీఆర్‌ఎస్ - 16.68 శాతం
ఏఐఎఫ్‌బీ - 0.20 శాతం
బీఎస్పీ - 0.41 శాతం
సీపీఐ (ఎమ్) - 0.13 శాతం
నోటా - 0.47 శాతం
ఇతరులు - 3.90 శాతం