మదనపల్లి, డిసెంబర్ 11:  తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల సహా 13 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. మరణించినవారిలో ఏపీకి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ (Lance Naik Sai Teja) కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ (Lance Naik Sai Teja)... జనరల్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సాయితేజ కుటుంబానికి (Lance Naik Sai Teja) ఏపీ సీఎం జగన్ రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు సాయితేజ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్ ను అందజేశారు.

మరోవైపు లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం బెంగళూరులోని ఎలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది. రేపు ఉదయం అక్కడ నుంచి అతడి స్వగ్రామానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‎లోని చిత్తూరు జిల్లా చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ ఈ ప్రమాదంలో మరణించారు. అతని భౌతికకాయం నేడు స్వగ్రామం ఎగువరేగడికి తీసుకురానున్నారు.

 భర్త మరో మహిళతో.. చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, తెలంగాణ జనగామ జిల్లాలో విషాద ఘటన

భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయి తేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు.