Andhra pradesh : Pensions distributed to beneficiaries at doorstep (photo-Facebook)

Amaravati, Dec 9: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లను (village and ward volunteers )ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం (AP government) నిర్ణయించింది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు (every month from time to time) తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 5,154 గ్రామ వలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 35 ఏళ్ళు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నారని ఓ ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో తాజాగా 551 మందికి కరోనా, 4 గురు మృతితో 7,042 కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, ప్రస్తుతం 5,429 యాక్టివ్‌ కేసులు

35 ఏళ్లు నిండిన వలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని కమిషనర్‌ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించడానికి చేపట్టిన చర్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మిగిలిన వారెవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు.