Coronavirus in AP (Photo Credits: PTI)

Amaravati, Dec 8: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56,187నమూనాలు పరీక్షించగా 551 పాజిటివ్‌ కేసులు (AP coronavirus) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,72,839 కు చేరింది. కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,042 కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 744 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 5,429 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.గుంటూరు జిల్లాలో 89, చిత్తూరు జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 58, తూర్పు గోదావరి జిల్లాలో 57 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 11 కేసులు వచ్చాయి.

భారత్‌లో గత 24 గంటల్లో 26,567 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,03,770కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,045 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 385 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,958కి పెరిగింది.

కరోనాకు తోడయిన డెంగ్యూ, డిసెంబర్ నాటికి 1000 మందికి పైగా జ్వరాలు, వణుకుతున్న దేశ రాజధాని ఢిల్లీ నగరం, దోమల బెడదను నివారించేందుకు అధికారులు సమాయత్తం

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,78,946 మంది కోలుకున్నారు. 3,83,866 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,88,14,055 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,26,399 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.