Amaravati, Nov 22: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన బిల్లులు కూడా చట్ట సభల్లో, కోర్టుల దాకా కూడా వెళ్లాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందుకు సంబంధించిన చట్టాలను ఉపసంహకరించుకున్నట్లు (Three Capitals Bill Repealed) జగన్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.
రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ నివేదించారు. అనంతరం దీనిపై తదుపరి విచారణను 2:15కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయితే.. ఈ ప్రకటన రాగానే ఇక మూడు రాజధానులు (Three Capitals Bill) లేవని.. ఇక ఏకైక రాజధాని ఉంటుందని అదే ఏంటనేది సస్పెన్ గా మారింది. కాసేపట్లో ఈ పాలనావికేంద్రీకరణకు సంబంధించి మరో బిల్లును అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.
కాసేపట్లో అసెంబ్లీలో ఉపసంహరణతో పాటు కొత్త బిల్లుకు సంబంధించి జగన్ కీలక అసెంబ్లీలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే.. ఈ బిల్లులో ఏయే అంశాలు ఉంటాయి..? జగన్ ఏం ప్రకటిస్తారో..? అనే విషయాలపై రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో మూడు రాజధానులపై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మాట్లాడనున్నారని ఏజీ తెలిపారు.