గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(crop loss compensation)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు.వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో 2023 డిసెంబర్లో తుఫాను కల్లోలం రేపిన సంగతి విదితమే. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్, దశాబ్దాల కల సాకారం అయినందుకు గర్వంగా ఉందని వెల్లడి
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ వర్షాభావం వల్ల, మిచాంగ్ తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం (AP government) ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.