AP Govt Employees Transfers: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త, జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు, త్వరలో అధికారిక ఉత్తర్వులు
CM-YS-jagan-Review-Meeting

Amaravati, June 6: ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ (AP Govt Employees Transfers) పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల (AP Govt Employees Transfers 2022) ఫైల్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇప్పటివరకూ నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం (AP Govt) ఇవాళ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సాధారణ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్ పై సీఎం జగన్ సంతకం కూడా చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. దీంతో రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ సాగేందుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబోతున్న ప్రభుత్వం.. జూన్ 17 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తోంది.

జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్

దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి విషయాల్లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న బదిలీల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Update News: ఏపీ ఉద్యోగుల బ‌దిలీల గైడ్ లైన్స్ ఇవే

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సాధార‌ణ బ‌దిలీల‌కు సంబంధించిన విధి విధానాల‌ను వెల్ల‌డిస్తూ మంగ‌ళ‌వారం (June 6) మ‌ధ్యాహ్నం ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ బదిలీలలో ఎవ‌రెవ‌రికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నదీ ఈ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అంతేకాకుండా ఈ నెల 18 నుంచి తిరిగి ఉద్యోగుల బ‌దిలీల‌పై నిషేధం అమ‌ల్లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఒకే చోట ఐదేళ్లుగా ప‌ని చేస్తున్న ఉద్యోగులు బ‌దిలీల‌కు అర్హులు. 40 శాతం కంటే అధిక వైక‌ల్యం ఉన్న ఉద్యోగుల‌కు బ‌దిలీల్లో ప్రాధాన్యం ల‌భించ‌నుంది. మాన‌సిక వైక‌ల్యం క‌లిగిన పిల్ల‌లున్న ఉద్యోగుల‌కు కూడా ప్రాధాన్యం ద‌క్క‌నుంది. కుటుంబీకుల్లో దీర్ఘ‌కాల వ్యాధులున్న ఉద్యోగుల‌కు కూడా బ‌దిలీల్లో ప్రాధాన్య‌మివ్వ‌నున్నారు. కారుణ్య నియామ‌కాల కింద నియ‌మితులైన వితంతువుల‌కు కూడా బ‌దిలీల్లో ప్రాధాన్యం ద‌క్క‌నుంది. వేర్వేరు ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న దంపతుల‌కు కూడా ప్రాధాన్య‌మిస్తారు.