GOVT Of AP Regulated Onion Prices: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, కిలో ఉల్లి 25 రూపాయలు మాత్రమే, ఏపీ రైతు బజార్లలో ప్రారంభమైన ఉల్లి విక్రయాలు, ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం
Ap govt to sell Onion for Rs 25 per Kg at all markets ( Photo-pexels )

Amaravathi, November 24: ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh)లోని అన్ని రైతు బజార్లలో నేటి నుంచి ఉల్లి విక్రయాలు ( Onion sale) ప్రారంభమయాయి. బయట మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల )(AP Rythu Bazars Sell Onions ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే (Onion for Rs 25 per Kg) ఏపీ ప్రభుత్వం (Ap govt) విక్రయించనున్నట్లు తెలిపింది. ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండడంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది.

రైతు బజార్లలో ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. వాటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లోని రైతు బజార్లకు పంపిస్తోంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి నిల్వలు పెరిగాక ఈ కోటాను పెంచనున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.

మరోవైపు క్వింటాల్‌ ఉల్లి ధర ఆల్‌టైమ్ గరిష్ఠంగా రూ .6,470 ను తాకింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ధర. అధిక ధర రైతులకు ఉత్సాహాన్ని కలిగించగా, వినియోగదారులకు మాత్రం ఇబ్బందిగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పంట నష్టం కారణంగా భారీగా ఉల్లిపాయల ధర పెరిగింది.