YSR Housing Scheme: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట, పేదలందరికీ ఇళ్లు పథకంపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్‌ బెంచ్, పేదల ఇళ్ల నిర్మాణానికి ఇక మార్గం సుగమం
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Nov 30: ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం (YSR Housing Scheme) విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్ రద్దు చేసింది .. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో (Andhra Pradesh High Court) దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు..

కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది … అయితే, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది .. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్.. పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును రద్దు చేసింది. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి విదితమే

25 లక్షల ఇళ్ల పట్టాల మంజూరు నిమిత్తం పలు మార్గదర్శకాలతో 2019 ఆగస్టు 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో 367లో... ఇళ్ల పట్టాల కేటాయింపు బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ (బీఎస్‌వో)–21లోని నిబంధనలు, అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనల ప్రకారం జరగాలని చెబుతున్న 3వ మార్గదర్శకాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ గతంలో హైకోర్టు కొట్టేసింది. ఇళ్ల పట్టాల మంజూరు విషయంలో అదనపు మార్గదర్శకాలతో 2019 డిసెంబర్‌ 2న జారీ చేసిన జీవో 488లోని 10,11,12వ క్లాజులను సైతం కొట్టేసింది.

పేదలందరికీ ఇళ్లు పథకానికి హైకోర్టు బ్రేక్, కోర్టు చెప్పిన ముఖ్యమైన కారణాలు ఇవే, తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

మార్గదర్శకాలను సవరిస్తూ 2020 మార్చి 31న జారీ చేసిన జీవో 99లోని క్లాజ్‌ బీ (కేటాయింపు ధర), క్లాజ్‌ సీ (ఇంటి నిర్మాణం)లను కూడా చట్ట విరుద్దమంటూ కొట్టేసింది. ఈ చట్టాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంది. లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను కన్వేయన్స్‌ డీడ్‌ రూపంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ డీడ్‌లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2022 కల్లా పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై పథకం పూర్తి, నిధులు విడుదల చేయాలని ప్రధానికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశామని లేఖలో తెలిపిన సీఎం

బీఎస్‌వో–21, అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం లబ్దిదారులకు డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పట్టాలు మహిళలకే ఇవ్వాలన్న జీవో 367లోని 2వ మార్గదర్శకాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ దానిని కొట్టేసింది.పట్టాలను అర్హతల ఆధారంగా పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు సైతం ఇవ్వాలంది