Vjy, Jan 10: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు (AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ సందర్భంగా దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎక్కడా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.
విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత
ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్ మంజూరైంది.