Amaravati, Sep 15: ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందినదిగా చెబుతున్న వీడియో (MP Gorantla Madhav Video Case) ఆ మధ్య వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు (ap high court issues stay order) తీర్పు చెప్పింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. మార్ఫింగ్ వీడియోతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో పలువురు టీడీపీ నేతల పేర్లను సీఐడీ అధికారులు చేర్చారు.ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ యువ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చిన వైనాన్ని విజయ్ హైకోర్టులో సవాల్ చేశారు. విజయ్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీ అధికారులను ఆదేశిస్తూ స్టే ఆర్డర్‌ను జారీ చేసింది.