Amaravati, Feb 18: న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్‌లోడ్ చేయడాన్ని అంగీకరించేది లేదని (AP High Court outraged Two senior lawyers ) తేల్చిచెప్పింది. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను అసలు సహించబోమని హెచ్చరించింది.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హైకోర్టు (AP Higi Court) ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రమేశ్‌కుమార్‌లనూ ఇటీవల అరెస్టుచేసిన సంగతి విదితమే. వీరు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అపకీర్తిపాలు చేసేలా (derogatory posts on judges) సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం విచారణ జరిపారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి వాదనలు వినిపించారు. మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి తమ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని వారు వాదించారు. కోర్టును లిఖితపూర్వకంగా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ కూడా ఇచ్చారన్నారు. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార చర్యలను మూసివేసిందన్నారు. వారి వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
నిందితులను దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నిందితుల పోలీసు కస్టడీ పూర్తయ్యాక కూడా జ్యుడిషియల్ రిమాండులో ఉండాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. మూడు వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజార్చేలా న్యాయవాదులే మాట్లాడటంపై అభ్యంతరం తెలిపింది.
సీబీఐ న్యాయవాది కె. చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వారికి బెయిల్ మంజూరు చేయరాదన్నారు. దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చిందని, ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దన్నారు. విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్‌రెడ్డి, న్యాయవాది డి.కోదండరామిరెడ్డి నిందితుల తరఫున వాదనలు వినిపించారు. న్యాయవాదులపై సుమోటోగా నమోదు చేసిన కోర్టుధిక్కరణ కేసులో క్షమాపణలు కోరారని, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో వారిరువురిపై ధర్మాసనం కోర్టుధిక్కరణ కేసును మూసేసిందన్నారు. సీబీఐ నమోదు చేసిన పలు సెక్షన్లు పిటిషనర్ల వ్యాఖ్యలకు వర్తించవన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెయిలు మంజూరు చేయాలని కోరారు.