![](https://test1.latestly.com/wp-content/uploads/2022/02/Mekapati-Goutham-Reddy-Demise-380x214.jpg)
Amaravati, Feb 22: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని (Goutham Reddy mortal ) నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో మంత్రి పార్థివదేహాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక చాపర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికదేహాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించారు.
చాపర్‌లో మంత్రి భౌతికకాయం వెంట తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇప్పటికే మేకపాటి కుటుంబసభ్యులు, బంధువులు ఈరోజు ఉదయం నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. యూఎస్ నుంచి మేకపాటి గౌతమ్ (AP IT minister Goutham Reddy) కుమారుడు కృష్ణార్జున రెడ్డి నెల్లూరుకు వచ్చిన తర్వాత బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగునున్నాయి.
ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కృష్ణార్జునరెడ్డి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.