Amaravati, Feb 9: ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు (AP Local Body Polls) కొనసాగుతున్నాయి. ఉదయం 6.30లకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నియోజకవర్గం నిమ్మాడలో 23 శాతం పోలింగ్ నమోదయ్యింది. నిమ్మాడలో పోలింగ్‌ను ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ (AP Panchayat Elections 2021) ప్రశాంతంగానే జరుగుతున్నా అక్కడక్కడా ఊళ్లలో ఘర్షణలు జరుగుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరు వర్గాలు కత్తులతో చెలరేగిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's AP PoliceTweet
The situation is well under control: DGP Gautam Sawang on Gram Panchayat Elections
AP Police is taking proactive & preemptive measures to implement poll strategies, ensuring the smooth process of Gram Panchayat Elections.#Elections #AndhraPradesh #appolice #panchayatelections pic.twitter.com/Wy10WDdHUA
— Andhra Pradesh Police (@APPOLICE100) February 8, 2021
ఇదంతా ఎన్నికల కారణంగానే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. డబ్బు ఇస్తున్న కొందరిని ఊరి ప్రజలు అడ్డుకున్నారు. అటు చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి ఓ వర్గం మద్దతుదారులు దాడులకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంటరవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదే జిల్లాలో ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలోమరో వర్గం ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేతలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
దువ్వూరు మండలంలో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ సానుభూతి పరుడు, సర్పంచ్ అభ్యర్థి జుత్తిక శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డారు.
అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు జరుగుతుంటే... మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా 3,249 సర్పంచ్ పదవులకు 32,502 వార్డు మెంబర్లు కోసం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30వరకూ ఈ పోలింగ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12,185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ కోసం 29,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 3,458 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా... 3,594 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
ఈ సారి నోటా ఓట్ల లెక్కింపు, 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, మీడియాతో గోపాలకృష్ణ ద్వివేది
తొలి విడతలో భాగంగా 3,249 సర్పంచ్ పదవులకు 32,502 వార్డు మెంబర్లు కోసం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30వరకూ ఈ పోలింగ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12,185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.
బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న పోలింగ్ కోసం 18,608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 8503 మధ్యరకం బ్యాలెట్ బాక్సులు. 21338 చిన్న బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి. ఎన్నికల కోసం దాదాపు 90వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారిలో స్టేజ్ - 1 ఆర్ఓలు 1,130, స్టేజ్-2 ఆర్ఓలు-3,249, ఏఆర్ఓలు 1,432, పీఓలు 33,533, ఇతర పోలింగ్ సిబ్బంది 44, 392 మంది, జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు 1,121, మైక్రో అబ్జర్వర్లు 3,046 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2,216 పెద్ద వాహనాలు, 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న స్టేషన్లకు 1,412 చిన్నస్థాయి వాహనాలను సిద్ధం చేశారు. వాటిలో అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
మధ్యాహ్నం 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14,535 సూపర్వైజర్లు, 37,750 మంది సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో నేడు జరగాల్సిన పోలింగ్‌ను రెండో దశకు వాయిదా వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై తుదినిర్ణయం ఎస్ఈసీదేనని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.