AP MPTC & ZPTC Polls 2021: ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

Amaravati, April 8: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే  జరుపుకోవచ్చంటూ హైకోర్టు (AP High Court) డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కౌంటింగ్‌ జరపొద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు

ఎన్నికలు జరిగే స్థానాలు

శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ, 601 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 494 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 38 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1004 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 44 జడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరు జిల్లాలో 46 జడ్పీటీసీ, 579 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరు జిల్లాలో 35 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 118 ఎంపీటీసీ స్థానాలకు, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 492 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 63 జడ్పీటీసీ, 791 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.