babu vs jagan (Photo-File Image)

Amaravati, Nov 17: ఆంధ్రప్రదేశ్‌లోని లో నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. వివిధ కారనాల వల్ల నిలిచిపోయిన నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు సోమవారం జరిగిన సంగతి విదితమే. ఓట్ల లెక్కింపు (AP Municipal Election Results 2021) బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. మొత్తం 353 డిజిన్లు లేదా వార్డు స్థానాల్లో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 325 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 1206 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వస్థలమైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవమైంది. బాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ ఖాతా తెరించింది. మొత్తం 25 స్థానాల్లో ఒక స్థానంలో ఎన్నిక ఏకగ్రీవమవ్వగా.. 24 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇప్పటికే ఈ కుప్పం నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఇలా ఎక్కువ స్థానాలను టీడీపీ కోల్పోయింది. 1,2,3,4,6,7,8,9,10,15 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, 5 వార్డు, 11 వార్డులో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

రైతుల కోసం జగన్ సర్కారు మరో ముందడుగు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ఏ సీజన్ పరిహారం ఆ సీజన్‌లో అందేలా నిర్ణయం, రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతుల అకౌంట్లలో రూ.22 కోట్లు జమ

దాచేపల్లి, గురజాల, కమలాపురం, బేతుంచెర్ల మున్సిపాలిటీలను అధికార వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. రాజంపేట మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. కమలాపురం, ఆకివీడు, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

కమలాపురంలో మొత్తం 20వ వార్డులకు గాను.. వైసీపీ 15, టీడీపీ 5 వార్డులు కైవసం చేసుకుంది. 1, 6, 12, 13, 19 వార్డులను టీడీపీ కైవసం చేసుకోగా.. మిగిలిన వార్డులను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. రాజంపేటలో 29 వార్డులకు గానూ 24 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ 4 వార్డులు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. మరోపక్క, ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 13 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, వైసీపీ ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక, కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో ఇప్పటికే 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ ఒక్క వార్డులో విజయం సాధించింది.

కుప్పంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు, 72.19 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన ఎస్ఈసీ నీలం సాహ్ని, ముగిసిన జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు

విశాఖ జీవీఎంసీ 61 వ వార్డులో వైసీపీ విజయం సాధించింది. 2,028 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి కొణతాల సుధ గెలుపొందారు. 61వ వార్డులో టీడీపీ పోటీ చేయలేదనే విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థికి 4,952 ఓట్లు రాగా... జనసేన అభ్యర్థికి 2,924 ఓట్లు వచ్చాయి. 61వ వార్డులో టీడీపీ పోటీ చేయలేదనే విషయం తెలిసిందే.

బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. బేతంచెర్లలో మొత్తం 20 వార్డులుండగా.. వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందారు. ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.