Amaravati, Mar 14: ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో (AP Municipal Election Results) వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగించింది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం కార్పొరేషన్ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.
ఇక 75 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ 73 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ (TDP) రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది. దీంతో మిగిలిన 11 కార్పొరేషన్‌లు, 75 మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి.
71 స్థానాలకు ఎన్నికలు జరగగా 69 స్థానాల్లో వైసీపీ గెలిచింది. రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది. కాగా పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల ఈ నాలుగు పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఫ్యాన్’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉనికి చాటలేక చతికిలపడ్డాయి.
| ఏపీ మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఇలా.. | ||
| S.No | మునిసిపాలిటీ | విజయం |
| 1 | ఇచ్ఛాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 2 | పలాస-కాశీబుగ్గ | వైఎస్ఆర్‌సీపీ |
| 3 | పాలకొండ | వైఎస్ఆర్‌సీపీ |
| 4 | బొబ్బిలి | వైఎస్ఆర్‌సీపీ |
| 5 | పార్వతీపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 6 | సాలూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 7 | నెల్లిమర్ల | వైఎస్ఆర్‌సీపీ |
| 8 | నర్సీపట్నం | వైఎస్ఆర్‌సీపీ |
| 9 | యలమంచిలి | వైఎస్ఆర్‌సీపీ |
| 10 | అమలాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 11 | తుని | వైఎస్ఆర్‌సీపీ |
| 12 | పిఠాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 13 | సామర్లకోట | వైఎస్ఆర్‌సీపీ |
| 14 | మండపేట | వైఎస్ఆర్‌సీపీ |
| 15 | రామచంద్రాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 16 | పెద్దాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 17 | ఏలేశ్వరం | వైఎస్ఆర్‌సీపీ |
| 18 | గొల్లప్రోలు | వైఎస్ఆర్‌సీపీ |
| 19 | ముమ్మిడివరం | వైఎస్ఆర్‌సీపీ |
| 20 | నర్సాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 21 | నిడదవోలు | వైఎస్ఆర్‌సీపీ |
| 22 | కొవ్వూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 23 | జంగారెడ్డిగూడెం | వైఎస్ఆర్‌సీపీ |
| 24 | నూజివీడు | వైఎస్ఆర్‌సీపీ |
| 25 | పెడన | వైఎస్ఆర్‌సీపీ |
| 26 | ఉయ్యూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 27 | నందిగామ | వైఎస్ఆర్‌సీపీ |
| 28 | తిరువూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 29 | తెనాలి | వైఎస్ఆర్‌సీపీ |
| 30 | చిలకలూరిపేట | పెండింగ్ |
| 31 | రేపల్లె | వైఎస్ఆర్‌సీపీ |
| 32 | మాచర్ల | వైఎస్ఆర్‌సీపీ |
| 33 | సత్తెనపల్లి | వైఎస్ఆర్‌సీపీ |
| 34 | వినుకొండ | వైఎస్ఆర్‌సీపీ |
| 35 | పిడుగురాళ్ల | వైఎస్ఆర్‌సీపీ |
| 36 | చీరాల | వైఎస్ఆర్‌సీపీ |
| 37 | మార్కాపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 38 | అద్దంకి | వైఎస్ఆర్‌సీపీ |
| 39 | చీమకుర్తి | వైఎస్ఆర్‌సీపీ |
| 40 | కనిగిరి | వైఎస్ఆర్‌సీపీ |
| 41 | గిద్దలూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 42 | వెంకటగిరి | వైఎస్ఆర్‌సీపీ |
| 43 | ఆత్మకూరు(N) | వైఎస్ఆర్‌సీపీ |
| 44 | సూళ్లూరుపేట | వైఎస్ఆర్‌సీపీ |
| 45 | నాయుడుపేట | వైఎస్ఆర్‌సీపీ |
| 46 | హిందూపురం | వైఎస్ఆర్‌సీపీ |
| 47 | గుంతకల్లు | వైఎస్ఆర్‌సీపీ |
| 48 | తాడిపత్రి | టీడీపీ |
| 49 | ధర్మవరం | వైఎస్ఆర్‌సీపీ |
| 50 | కదిరి | వైఎస్ఆర్‌సీపీ |
| 51 | రాయదుర్గం | వైఎస్ఆర్‌సీపీ |
| 52 | గుత్తి | వైఎస్ఆర్‌సీపీ |
| 53 | కళ్యాణదుర్గం | వైఎస్ఆర్‌సీపీ |
| 54 | పుట్టపర్తి | వైఎస్ఆర్‌సీపీ |
| 55 | మడకశిర | వైఎస్ఆర్‌సీపీ |
| 56 | ఆదోని | వైఎస్ఆర్‌సీపీ |
| 57 | నంద్యాల | వైఎస్ఆర్‌సీపీ |
| 58 | ఎమ్మిగనూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 59 | డోన్ | వైఎస్ఆర్‌సీపీ |
| 60 | ఆళ్లగడ్డ | వైఎస్ఆర్‌సీపీ |
| 61 | నందికొట్కూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 62 | గూడూరు(K) | వైఎస్ఆర్‌సీపీ |
| 63 | ఆత్మకూరు(K) | వైఎస్ఆర్‌సీపీ |
| 64 | ప్రొద్దుటూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 65 | పులివెందుల | వైఎస్ఆర్‌సీపీ |
| 66 | జమ్మలమడుగు | వైఎస్ఆర్‌సీపీ |
| 67 | బద్వేల్ | వైఎస్ఆర్‌సీపీ |
| 68 | రాయచోటి | వైఎస్ఆర్‌సీపీ |
| 69 | మైదుకూరు | టీడీపీ |
| 70 | ఎర్రగుంట్ల | వైఎస్ఆర్‌సీపీ |
| 71 | మదనపల్లె | వైఎస్ఆర్‌సీపీ |
| 72 | పుంగనూరు | వైఎస్ఆర్‌సీపీ |
| 73 | పలమనేరు | వైఎస్ఆర్‌సీపీ |
| 74 | నగరి | వైఎస్ఆర్‌సీపీ |
| 75 | పుత్తూరు | వైఎస్ఆర్‌సీపీ |
మొత్తం 11 కార్పోరేషన్లలో వైసీపీ క్లీన్ స్వీప్
విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం