Voting | Represtional Image | (Photo Credits: PTI)

Amaravati, Mar 10: ఆంధ్రప్రదేవ్ మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలయింది. అయితే ఓటర్లు ఓటు వేసేందుకు ఏం గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలనే దానిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ జాబితాలో పేరున్న వారంతా.. ఓటర్ ఐడీ అందుబాటులో లేకున్నా ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది.

ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓట‌రు గుర్తింపు కార్డుల‌యినా చూపాల్సి ఉంటుంది. లేదంటే.. ఈ కింద తెలిపిన 18 ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా ఒక‌దానిని చూపాలని ఎన్నిక‌ల అధికారి వెల్లడించారు.

మరోవైపు, మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతో పాటు మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ కూడా ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటర్లకు ఓటరు స్లిప్‌లను బూతు లెవల్ అధికారులు పంపిణి చేశారు. అయితే, ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడం వల్ల అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది.

ఏపీలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌, ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు:

1. ఆధార్ కార్డు,

2. పాస్‌పోర్ట్‌,

3. డ్రైవింగ్ లైసెన్స్‌,

4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫైకార్డ్‌,

5. ఫోటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌బుక్‌,

6. పాన్ కార్డు,

7. ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు,

8. జాబ్ కార్డు,

9. హెల్త్ కార్డు,

10. ఫోటోతో కూడిన పింఛ‌న్‌ డాక్యుమెంట్,

11. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం,

12. రేషన్ కార్డు,

13. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం,

14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు,

15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు,

16. అంగవైకల్యం సర్టిఫికేట్,

17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు,

18. పట్టదారు పాస్ బుక్