Amaravati, Feb 9: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు (AP Panchayat Elections 2021) వెలువడుతున్నాయి. ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలను (YSRCP Wins Majority Panchayats) కైవసం చేసుకుంది. టీడీపీ చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయింది.
ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1057 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 75 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 2, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు. మొత్తంగా 3,249 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నరసాపురం డివిజన్ పంచాయతీ ఎన్నికలలో భిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు 12 పంచాయతీల సర్పంచ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో వైసీపీ అయిదు, టీడీపీ మూడు, జనసేన మూడు, బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఒకరు గెలిచారు. ఈ డివిజన్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నర్సాపురం మండలం రాజుగారితోట, పాత నవరసపురం, మొగల్తూరు మండలం జగన్నాధపురం పంచాయతీలలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. పోడూరుమండలంరావిపాడు సర్పంచ్‌గా పెనుమత్స విజయలక్ష్మి విజయం సాధించారు.
నిమ్మాడలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజరాపు సురేష్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అప్పన్నపై 1700 ఓట్ల మెజార్టీతో సురేష్ విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారు అప్పన్నకు కేవలం 157 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ సందర్భంగా నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్ మాట్లాడుతూ తమ కుటుంబంపై నిమ్మాడ ప్రజలు మరింత బాధ్యతను పెంచారన్నారు. ‘‘ఎర్రన్న ఆశీస్సులు, అచ్చెన్న,రామ్మోహన్ నాయుడు సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించరిస్తాను. నిమ్మాడ ఎన్నికల్లో పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. కింజరాపు కుటుంబం మొత్తాన్ని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు. వైసీపీకి నిమ్మాడ ఎన్నిక చెంపపెట్టు.’’ అని అన్నారు.
జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1
కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0
అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0
ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0
గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2
కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1
శ్రీకాకుళం(321): వైసీపీ 39, టీడీపీ 0
విశాఖ (340): వైసీపీ 42, టీడీపీ 1, ఇతరులు 1
తూర్పుగోదావరి (366): వైసీపీ 29, టీడీపీ 0, ఇతరులు 1
పశ్చిమగోదావరి (239): వైసీపీ 38, టీడీపీ 0, ఇతరులు 3
కృష్ణా (234): వైసీపీ 21, టీడీపీ 2
చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 6