COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,239 కోవిడ్19 కేసులు మరియు 61 మరణాలు నమోదు, మరో 11 వేలకు పైగా రికవరీ; నేటి నుంచి రాష్ట్రంలో ప‌గ‌టి పూట క‌ర్ఫ్యూ సడలింపులు పెంపు
Representational Image | (Photo Credits: PTI)

Amaravathi, June 11:  ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు గతంలో కంటే తక్కువగానే నమోదతున్నప్పటికీ, రాష్ట్రంలో వైరస్ ఉధృతి ఇంకా తగ్గని నేపథ్యంలో కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగించాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు నుంచి మరో రెండు గంటల పాటు సడలింపులను పెంచారు. ఏపిలో ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. ఆ తర్వాత 16 గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కర్ఫ్యూను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్ ఉంటేనే AP లోకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,01,863 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 8,239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 17,96,122కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 17,93,227గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 1396 కోవిడ్ కేసులు నమోదు కాగా..  తూర్పు గోదావరి జిల్లా నుంచి 1271  మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 887 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

ఈ సెకండ్ వేవ్‌లో ఏపిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే 67 శాతం కేసులు నమోదవగా, పట్టణ ప్రాంతాల్లో కేవలం 33 శాతం మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయి. గతంలోనూ ఏపి ఆరోగ్యశాఖ  ఇదేరకమైన ప్రకటన చేసి, ఆ తర్వాత విభేదించింది.

Here's the update:

ఇక, గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 61 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 11,824కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,135 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 16,88,198 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 96,100 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.