AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో 332 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు,  రాష్ట్రంలో కొత్తగా మరో 179 కరోనా కేసులు నమోదు, ఏపికి సంబంధించిన కరోనా అప్‌డేట్స్ చూడండి
Vaccine | Image used for representational purpose (Photo Credits: Oxford Twitter)

Amaravati, January 14: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ శనివారం 332 కేంద్రాలలో కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి  రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఒక్కొక్కరికి 0.5 మిల్లీలీటర్ల డోసును ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సంబంధించి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ వచ్చిందని అధికారులు తెలిపారు, అవసరాన్ని బట్టి కేంద్రం మరిన్ని డోసులకు అనుమతిస్తుందని పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  41,671  మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,85,616కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,82,721గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో ఎక్కువగా  ఒక్క చిత్తూరు  జిల్లా నుంచే 51 కేసులు రాగా, మిగతా జిల్లాల నుంచి స్వల్పంగానే కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు, గుంటూరు, కృష్ణా మరియు విశాఖ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం కొవిడ్ 4 మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7138కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 219 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,85,616 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,338 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.