Amaravati, Oct 18: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,881 నమూనాలు పరీక్షించగా 3,676పాజిటివ్ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,79,146కు చేరింది. కొత్తగా 24 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,406కి (COVID Deaths) చేరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 5,529 మంది కోవిడ్‌ను (Coronavirus) జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 69,91,258 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,102యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చిత్తూరులో ఐదుగురు, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, అనంత, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 6,406కు చేరాయి.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి(42)కి పాజిటివ్ రావడంతో ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆస్పత్రిలో ఈనెల 15న చేర్పించారు. కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శనివారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని మరుగుదొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 997 కేసులు కావడంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 85,563కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 567 మంది కొవిడ్ బారినపడగా.. బాధితుల సంఖ్య 1,09,611 కు చేరింది. కృష్ణాజిల్లాలో మరో 308 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో శనివారం 91 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 38,193కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 125 పాజిటివ్‌లు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలో మరో 193 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం 91 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో మరో 259 మందికి పాజిటివ్ వచ్చింది. చిత్తూరు జిల్లాలో మరో 473 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో మరో 204 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54,100కు చేరుకుంది. కడప జిల్లాలో 246 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 49,782కు చేరింది. ఇప్పటి వరకు 482మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా 240 కేసులు వెలుగు చూశాయి.