HRC in Kurnool: ఏపీ ప్రభుత్వం కీలక అడుగు, కర్నూలులో హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
AP HRC Chairman M. Sitaramamurthy (Photo-Tweiter)

Amaravati, Sep 1: ఏపీలో కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (AP State Human Rights Commission) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ( Justice M. Sitaramamurthy) మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్‌ రైతుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్‌ 316పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్‌ ప్లాట్లు వెనక్కి తీసుకుంటామంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అసైన్డ్‌ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ భూముల మ్యుటేషన్..ప్రకాశం జిల్లాలో 11 మంది వీఆర్వోలు సస్పెండ్, విశ్రాంత తహసీల్దార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశాలు

ఇక సంగం డెయిరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్లను కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ రిట్‌ అప్పీల్‌ను తిరస్కరించింది.