AP Weather Report: ఏపీకి భారీ వర్ష సూచన, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, Oct 28: ఏపీలో రానున్న మూడు రోజులు వాతావరణంలో మార్పులు (AP Weather Report) సంభంవించనున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడురోజులు విస్తారంగా వర్షాలు ( Rain forecast for next three days) పడతాయని తెలిపారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు.

రైతులకు దివాళి పండగ..మూడు పథకాల నిధులు ఒకేసారి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, మొత్తం రూ.2,190 కోట్లు రైతుల అకౌంట్లలో జమచేసిన ఏపీ ప్రభుత్వం

ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిశాయి.